RPF: రైలులో ఫోన్‌లు పొగొట్టుకునే వారికోసం రైల్వే కొత్త నిర్ణయం! 7 d ago

రైలు ప్రయాణికులకు ఇది ఒక శుభవార్త. ప్రయాణికులు రైలులో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను కనిపెట్టడానికి, వాటిని స్వాధీనం చేసుకోవడానికి రైల్వే రక్షణ దళం..RPF టెలికమ్యూనికేషన్ శాఖకు చెందిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్‌తో చేతులు కలిపింది. సీఈ ఐఆర్ కలిసి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో చేపట్టిన పైలట్ ప్రోగ్రాం విజయవంతమైంది. ఇప్పుడు దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని, లక్షల మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది అని రైల్వే మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
CEIR పోర్టల్ అనేది IMEI నంబర్‌ను బ్లాక్ చేయడం ద్వారా మొబైల్ ఫోన్లను తిరిగి పొందేందుకు, దొంగలించిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేసి.. ట్రాకింగ్ చేసేందుకు పనిచేస్తుంది. టెలికమ్యూనికేషన్ శాఖ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ విభాగం రూపొందించబడింది. దీంతో ఆ మొబైల్ ఫోన్లను తిరిగి అమ్మడానికి వీలుండదు. అంతే కాకుండా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను అడ్వాన్స్ ట్రాకింగ్ ద్వారా తొందరగా ట్రేస్ చేయొచ్చు అని రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది.